4 September, 2026 | 7:14 AM

పారదర్శకంగా నియామక ప్రక్రియ

04-09-2026 | 05:20am

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Tejas Nandalal Pawar)

సూర్యాపేట, సెప్టెంబర్ 3 (విజయక్రా ంతి) : సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ(Suryapet Government Medical College) నందు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డి పార్ట్మెంట్ వారి ఆదేశాల ప్రకారం కాంట్రాక్టు పద్ధతిన ప్రొఫెసర్లు(professors) (ఆల్ డిపార్ట్మెంట్స్), అసిస్టెంట్ ప్రొఫెసర్లు(Assistant Professors), అసోసియేటెడ్ ప్రొఫెస ర్స్(Associated Professors), ట్యూటర్స్ నియామకాలకు సంబంధించి నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ ప్రక్రియ(Counseling Process)ను గురువారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప రిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ నియామక ప్రక్రియ పారదర్శకం గా నిర్వహించాలని అలాగే నియామక ప్రక్రి య పూర్తయిన తర్వాత ఎలాంటి ఖాళీలు ఉ ండకూడదని, సంబంధిత విభాగాలకు  అభ్యర్థులు రాకపోతే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలన్నిటిని భర్తీ చేయాలని అన్నారు.

అలాగే మెడికల్ కాలేజీకి సంబంధించి ఏమైనా అత్యవసర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావలసి ఉంటే ప్రతి పాదనలు  సమర్పించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ జె వి డి ఎస్ ప్రసాద్, జి జి హెచ్ సూపర్డెంట్ శ్రవణ్ కుమార్, ఆల్ డిపార్ట్మెంట్స్ హెచ్ ఓ డి స్, ఆర్‌ఎంవోలు పాల్గొన్నారు.