4 March, 2026 | 1:34 AM

ప్రమాదపుటంచున ప్రయాణం

04-03-2026 12:01 AM

ఆటోలో పరిమితికి మించి ప్రమాదభరితంగా విద్యార్థుల తరలింపు 

క్షేత్ర స్థాయిలో కొరవడిన పర్యవేక్షణ 

అలంపూర్ మార్చి 3: రేపటి భావి తరాలకు మంచి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలంటే చదువు ఒక్కటే కాదు. విద్యార్థులు ఆ చదువులు చదువుకునేందుకు కొన్ని ప్రైవేటు విద్య సంస్థల యాజామాన్యాల నిర్లక్ష్య వైఖరికి రిస్కులతో కూడిన ప్రయాణాలు చేయాల్సిన దుస్థితి నేటి భావి తర వి ద్యార్థులకు తప్పడం లేదు. జిల్లాలో ఉన్న పలు ప్రైవేటు పాఠశాలలు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవ హరిస్తున్నాయి.

విద్యాశాఖ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలల నిర్వహణను కొనసాగాల్సిన విద్య సంస్థలు వాటిని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కారణం క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడమేనని ప్రజల్లో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడే మా త్రమే సంబంధిత అధికారులు హడావుడి చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

ముఖ్యంగా వడ్డేపల్లి,అయిజ పట్టణంలో పుట్టగొడుగుల్లా పదుల సంఖ్యలో ప్రైవేటు విద్య సంస్థలు వెలుస్తున్నాయి.పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు లేనప్పటికీ వాటి నిర్వహణ కొనసాగుతుంది.అసలు ఇలాంటి స్కూల్ లకు అధికారులు అనుమతుల ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు ప్రజల్లో తలె త్తుతున్నాయి.అయిజ పట్టణంలో ఓ ప్రైవేటు విద్య సంస్థ ఆటోల్లో విద్యార్థులను ఇలా పరిమితికి మించి ప్రమాదభరితంగా విద్యార్థుల స్కూల్ కి తరలిస్తున్నారు.వీళ్లను చూసిన పట్టణ ప్రజలు సర్వత్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమాయకత్వమే పెట్టుబడి.

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు,కూలీ పనులకు వెళ్ళే వ్యవసాయ కూలీలు తల్లిదండ్రులు వారి పిల్లలు తమలా కష్టపడకూడదని వారికి చక్కటి విద్యను అందిస్తే తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచుకుంటారని భావిస్తుంటారు.తల్లిదండ్రులు పల్స్ గ్రహించిన పలు ప్రైవేటు విద్య సంస్థలు వారి అమాయకత్వాని ఆసరాగా చేసుకుని తమ విద్య సంస్థలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం అని మాయమాటలు చెప్పి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసి అడ్మిషన్లు పెంచుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.తీర చూస్తే అక్కడ విద్యార్థులకు ఎలాంటి వసతులు సౌకర్యాలు లేవని చర్చ జరుగుతుంది.

ఫిట్నెస్ లేని బస్సులు తరచూ ప్రమాదాలు

ప్రైవేటు స్కూళ్లు యజమానులు కనీసం విద్యార్థులను చేరవేసేందుకు ఫిట్నెస్ కలిగిన బస్సులు కూడా అందుబాటులో లేనట్టు స్పష్టం అవుతుంది.వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు ఆటోలలో విద్యార్థులను కిక్కిరిస్తూ ప్రమాదపు అంచుల్లో నిర్లక్ష్యంగా ప్రయాణాలను సాగిస్తున్నారు.ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడే అధికారులు కూడా తూతూ మంత్రంగా పర్యవేక్షణ చేసి చేతులు దులుపుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.