4 March, 2026 | 3:38 AM

ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు

04-03-2026 12:00 AM
  1. ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు
  2. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలందరికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదని, అధర్మం పై ధర్మం విజయం సాధిస్తుందని, అసత్యంపై సత్యం గెలుస్తుందని, భక్తి అన్ని అడ్డంకులను అధిగమిస్తుందని గుర్తు చేసే శాశ్వత సందేశమన్నారు.

హోలికా దహనంతో పవిత్ర అగ్నిజ్వాలల్లో మన దుఃఖాలు, అసూయ, ద్వేషం, కక్ష, అహంకారం అన్నీ దగ్ధమవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. అందరి జీవితాల్లో సంతోషం, ఐశ్వర్యం, ఆనందం, శుభమంగళాలు నిండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.