5 June, 2026 | 2:31 AM

గాలివానకు విరిగిన చెట్టుకొమ్మలు

05-06-2026 01:16 AM

నాలుగు రోజులైనా పట్టించుకోని అధికారులు  

వేంసూర్, జూన్ 4 (విజయక్రాంతి): వేంసూరు మండలం కొత్త చౌడవరం గ్రామంలోని ప్రధాని రహదారిపై నాలుగు రోజులుగా రహదారి పక్కనే ప్రమాదకరంగా విరిగిన చెట్టు కొమ్మలు, స్థానిక ప్రాంతంలో ఇటీవల వీచిన బలమైన గాలుల కారణంగా రహదారి పక్కన ఉన్న భారీ చెట్టు కొమ్మలు విరిగి పడిపోయాయి.

అయితే ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా ఆర్&బీ (రోడ్స్ అండ్ బిల్డింగ్స్) శాఖ అధికారులు ఇప్పటివరకు వాటిని పూర్తిగా తొలగించకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతోంది. విరిగిన చెట్టు కొమ్మలు రహదారి అంచున ప్రమాదకరంగా వేలాడుతూ ఉండటంతో వాహనదారులు, పాదచారులు భయాందోళనలకు గురవుతున్నారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు.ఇప్పటికే నాలుగు రోజులు గడిచినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా మరిన్ని కొమ్మలు విరిగి పడే అవకాశం ఉన్నందున వెంటనే చర్యలు తీసుకుని చెత్తాచెదారాన్ని తొలగించాలని, రహదారిని పూర్తిగా సురక్షితంగా మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.