కల్వకుర్తి అభివృద్ధే నా ధ్యేయం
‘డయల్ యువర్ ఎమ్మెల్యే’కు విశేష స్పందన
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
ఆమనగల్లు, జూన్ 16 (విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుం టూ వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉం టానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ’డయల్ యువర్ ఎమ్మెల్యే’ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా ప్రజలు తమ గ్రామాల సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య దూరాన్ని తగ్గించి, నేరుగా సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ’డయల్ యువర్ ఎమ్మెల్యే’ వినూత్న కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి మొత్తం 235 కాల్స్ రాగా, అందులో 62 మంది ప్రజలు నాతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను వివరించారు. అర్జీదారుల సమస్యలపై తక్షణమే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాల ని ఆదేశించానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






