సర్వర్ డౌన్.. రవాణా శాఖలో సేవలకు అంతరాయం
17-06-2026 02:01 AM
మహబూబాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): రవాణా శాఖ ఆన్లైన్ సేవలకు సర్వర్ డౌన్ కావడంతో రెండు రోజులుగా సేవల నిలిచిపోయినట్లు మహబూబాబాద్ ఆర్టీవో పరిధిలోని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సోమవారం సర్వర్ డౌన్ కారణంగా సేవలు నిలిచిపోయాయని, మంగళవారం కూడా అదే తరహాలో సర్వర్ డౌన్ కొనసాగిందని, దీనితో నూతన వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, లర్నింగ్ లైసెన్సులు, ఇతర రవాణా శాఖ సేవలకు ఆటంకం కలిగిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సాంకేతిక సమస్య లోపాన్ని గుర్తించి సరిచేయాలని, సేవలను వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు.






