17 June, 2026 | 2:43 AM

అటవీ ప్రాంతమైనా.. అక్షరాస్యతలో ములుగు ముందంజ

17-06-2026 02:04 AM
  1. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 50 సైకిళ్ల పంపిణీ
  2. అమ్మకు అక్షరమాలతో మహిళల్లో విద్యా చైతన్యం
  3. సేవతో సమాజంలో వెలుగులు నింపాలి
  4. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క

ములుగు, మహబూబాబాద్ జూన్ 16 (విజయక్రాంతి): మారుమూల వెనుకబడిన, అటవీ ప్రాంత జిల్లాగా పేరుగాంచిన ములు గు జిల్లా విద్యా రంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని, విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీ ణ నీటి సరఫరా, మహిళా, శిశు సం క్షేమ శా ఖ మంత్రి దనసరి అనసూయ సీత క్క అన్నా రు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 50 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తో కలిసి హాజరై విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా నిరక్షరాస్యత అధికంగా ఉన్న వెనుకబడిన జిల్లా అయినప్పటికీ జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమిష్టి కృషి ఫలితంగా ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానం, ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలో రెండో స్థానం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందని, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మొదటి మూడు స్థానా ల్లో నిలిచిన విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సహకారంతో 50 సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు సైకిళ్లు తదితర సేవా కార్యక్రమాలతో సమాజానికి అండగా నిలుస్తున్న రోటరీ క్లబ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఈ సైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జిల్లాలో సేవా, సహా య కార్య క్రమాలు, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపట్టేందుకు ముం దుకు వ చ్చే స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.. ప్రభుత్వం చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం రాష్ట్రంలో మహిళా అక్షరాస్యతకు కొత్త దిశానిర్దేశం చేస్తోందన్నా రు.

చదువురాని 12 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను గుర్తించామని, మొద టి విడతగా 6 లక్షల మందికి లిటరసీ పరీక్షలు నిర్వహించగా 83.33 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. ఇప్పు డు మరో 6 లక్షల మందిని పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని, భవిష్యత్తులో వారందరినీ పదో తరగతి పరీక్షలకు కూడా సిద్ధం చేసే కార్యాచరణ చేపడుతున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలో నిరక్షరాస్యత లేకుండా ప్రతి మహిళను అక్షరాస్యత వైపు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యా ర్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా కష్టపడి చదవాలని, విద్యను కేవలం బట్టీ పట్టే విధంగా కాకుండా ప్రతి సబ్జెక్టును లోతుగా అర్థం చేసుకుని నేర్చుకునే అలవాటు పెంపొందించుకోవాలని సూచించా రు.

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ, పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం సంతోషకరమన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కళ్యాణి, మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, వైస్ చైర్మన్ షాహిన్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.