9 April, 2026 | 3:36 AM

మేడ్చల్ పెద్ద చెరువు ర్యాంపుపై ట్రెంచ్ కటింగ్

09-04-2026 01:41 AM

వారం రోజుల్లో అక్రమ నిర్మాణం కూల్చివేయాలని నోటీసు 

మేడ్చల్, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): మేడ్చల్ పెద్ద చెరువు కట్టకు ర్యాంపు, కట్టకింద బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణం విషయంలో ఇరిగేషన్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఈనెల 6వ తేదీన విజయ క్రాంతి దినపత్రికలో ’పెద్ద చెరువు చిన్న పోయింది!’శీర్షిక న వచ్చిన కథనానికి స్పందనగా చర్యలు చేపట్టారు. అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేశారు.

ర్యాంపు పై అడ్డంగా జెసిబి తో ట్రెంచ్ కటింగ్ చేశారు. కట్టకింద బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి  లేని నిర్మాణం విషయమై నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని నిర్మాణదారుడికి నోటీసు ఇచ్చామని, లేకుంటే ఆమె కూల్చి వేస్తామని వర్క్ ఇన్స్పెక్టర్ ఇర్షాద్ స్పష్టం చేశారు. కట్టకింద బఫర్ జోన్లో, ఎఫ్ టి ఎల్ పరిధిలో నిర్మాణాలను చేపడితే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.