09-09-2025 01:25:36 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే అతి పెద్ద దైన గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అవసరమైన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపడతున్నా మని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి సమీక్ష నిర్వహించారు.
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా, గిరిజనుల మనోభావాలకు అ నుగుణంగా ఆలయ ఆధునీకరణ పను లు చేపడుతున్నామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఈ పనులను ఈ నెల 15 నుంచి ప్రారంభించి జనవరి మొదటి వారంలోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.