09-09-2025 01:26:00 AM
రూ.20 లక్షలు జరిమానా విధించిన అటవీశాఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి) : కూకట్‌పల్లి పరిధిలోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఆవరణలోని చెట్ల నరికివేతపై అటవీ అధికారులు భారీ ఎత్తున జరిమానా విధించారు.. గతవారం ఆ కంపెనీ పరిధిలో చెట్లు నరికివేతపై స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.. దీనిపై విచారణ చేపట్టిన అటవీ అధికారులు అనుమతులు లేకుండా చెట్ల నరికివేతపై సదరు యాజమాన్యానికి రూ.20 లక్షల జరిమానాను విధించారు.. సోమవారం యాజమాన్యం అటవీ శాఖకు రూ.20 లక్షల జరిమానాను చలాన్ రూపంలో చెల్లించిందని మేడ్చల్ జిల్లా అటవీ అధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు.