17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పనికోసం వెళ్ళిన వ్యక్తి అదృశ్యం

06-02-2026 08:15 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): పనికోసమని ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్వో సైదయ్య తెలిపిన కథనం ప్రకారం... జవహర్ నగర్ లోని సీపీఐ కాలనీలో సంధ్యాకుమారి, భర్త అజిత్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజిత్ కుమార్ ఇటీవల నగరానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5న పనికోసమని సికింద్రాబాద్ కు వెళ్ళినఅజిత్ కుమార్(30) తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకి కోసం చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు సంధ్యాకుమారి జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.