09-09-2025 01:22:48 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఉప రాష్ర్టపతి ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. ఇదేరోజు సాయంత్రం సీఎం కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.