2 September, 2026 | 11:27 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

భద్రాద్రిలో గిరిజన నాయకులు ధర్మా పుట్టినరోజు వేడుకలు

15-06-2025 | 07:13pm

రోగులకు పండ్లు పంపిణీ..

భద్రాచలం (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మారావు జన్మదినం సందర్భంగా ఆదివారం సేవా దృక్పథంతో శ్రీమతి కుంజా సత్యవతి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య నేస్తం కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో రోగులకు పండ్ల పంపిణీ చేయడంతో పాటు, సరోజినీ అనాధ వృద్ధుల, వికలాంగుల ఆశ్రమంలో నివసిస్తున్న వారికి పండ్లు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన కుంజా ధర్మారావు  పుట్టినరోజును కేవలం వ్యక్తిగత ఉత్సవంగా కాకుండా, సేవా దినంగా జరుపుకోవడం సమాజానికి ఆనందదాయకమైన సంప్రదాయం అని ప్రజల మధ్య ప్రేమను పంచే విధంగా, సేవా కార్యక్రమాలు కొనసాగాలనీ, హాస్పిటల్లో రోగులకు మంచి చికిత్స అందేలా ప్రభుత్వ విధానాలు మరింత బలోపేతం కావాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి(Minister Kishan Reddy) జన్మదినాన్ని కూడా ప్రస్తావిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఫౌండేషన్ సభ్యులు, వైద్య సిబ్బంది, ఆశ్రమ నిర్వాహకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.