11 August, 2026 | 1:12 AM

ఆదివాసీల సంప్రదాయాలు గొప్పవి

26-05-2024 12:51 AM

ఆదిలాబాద్, మే 25 (విజయక్రాంతి): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండలంలోని లక్షెట్టిపేట గ్రామంలో ఆర్క పరివార్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘భావె మహినా’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదివాసీల ఆరాధ్య దైవం పెర్సపెన్‌కు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆదివాసీలు ప్రకృతిని దైవంగా భావించి ఎంతో నియమ నిష్టలతో పూజలు చేసి తమ సంస్కృతి, సంప్రదాయాలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పడం సంతోషకరమన్నారు.  


-ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు