10 August, 2026 | 11:47 PM

104 ఉద్యోగుల ఆందోళన

26-05-2024 12:56 AM

జగిత్యాల, మే 25 (విజయక్రాంతి): జిల్లా వైద్యాధికారి శ్రీధర్ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా ఆసుపత్రి ఎదుట 104 ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. ఆయన వేధింపులు, పని ఒత్తిడితోనే 104 అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్ గుండెపోటుకు గురై ప్రాణం కోల్పోయాడని ఆరోపించారు. జిల్లా వైద్యాధికారి అదనంగా డ్యూటీ చేయమని ఒత్తిడి తెచ్చారని, గత రెండు రోజులుగా రాజ్‌కుమార్ విరామం లేకుండా విధుల్లో ఉండి గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ఉద్యోగం పేరిట వ్యక్తిగత పనులు చేయిస్తూ ఉద్యోగులను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, రాజ్‌కుమార్ మృతికి జిల్లా వైద్యాధికారి బాధ్యత వహించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. డీఎంహెచ్‌ఓపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. 104 ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ప్రకాష్, పార్మాసిస్టు ఉద్యోగి హేమలత, ఉద్యోగులు ఉన్నారు. డీఎంహెచ్‌ఓ వేధిస్తున్నారని ఆరోపణ