16 April, 2026 | 10:53 AM

తాగునీటి కోసం రోడ్డెక్కిన గిరిజనులు

24-06-2025 12:35 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 23 (విజ యక్రాంతి): తాగునీరు అందించాలని సోమవారం కెరమెరి మండల కేంద్రంలోని ప్రధా న రహదారిపై గిరిజనులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని పాట్నా పూర్, బాబీజరి, పిట్టగూడా, కోలంగూడ, జోడేఘాట్, పాటగూడ తదితర గ్రామాలకు గత నెలరోజులుగా మిషన్ భగీరథ నీరు రావడంలేదని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించి న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాస్థాయి అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రోడ్డుపై బీస్మించుకొ ని కూర్చున్నారు. తాగునీటి కోసం నిరసన తెలుపుతున్న సమయం లో అంబులెన్స్ వస్తుందని దారి ఇవ్వాలని పోలీసులు గిరిజనులను కోరడంతో  దారి ఇచ్చిన క్రమంలో జిల్లా అదనపు కలెక్టర్  వెళ్లడాన్ని చూసి ఆదివాసీలు మరోసారి ఆందో ళనకు దిగారు.

తాగునీరు కోసం తాము రోడ్డుపై ఆందోళన చేస్తుంటే అదన కలెక్టర్ ఆగకుండా వెళ్లడాన్ని ఆదివాసీలు తప్పుపట్టారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ విశ్వేశ్వర్ వచ్చి 12 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటా మని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.