24-06-2025 12:35:39 AM
జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు బొక్క నరసింహా రెడ్డి
కందుకూరు,జున్ 23 :అఖండ భారతావని నినాదాన్ని ఎలుగెత్తి చాటిన నిజమైన దేశభక్తుడు జన సంఘం వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి అన్నారు.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగం మరవరానిదని తెలిపారు.
సోమవారం కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నిమ్మ అంజిరెడ్డి ఆద్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ ఆదేశాల మేరకు లక్ష్యం కోసం లక్ష చెట్లు కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి దేశీయ చెట్ల మొక్కలను నాటే కార్యక్రమానికి హాజరై శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందేల శ్రీరాములు యాదవ్,బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పాపయ్య గౌడ్,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె సుదర్శన్ రెడ్డిలతో కలసి కందుకూరు మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు.అనంతరం పార్టీ నాయకులతో కలసి మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని,ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి నాయకులు,కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
ఈకార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తేరటి లక్ష్మణ్ ముదిరాజ్,జిట్టా రాజేందర్ రెడ్డి,పల్లె కృష్ణ గౌడ్,సాధ మల్లారెడ్డి,జగదీశ్వర్ రెడ్డి,పున్న బిక్షపతి,దేశం సత్తిరెడ్డి,ముచ్చర్ల మాజీ ఎంపిటిసి బక్క మల్లేష్,గౌర ప్రభాకర్, నల్లబోలు నరసింహారెడ్డి,కృష్ణారెడ్డి, సోమరాజు వెంకటేష్,సురసాని భూమి రెడ్డి, రవీందర్ ముదిరాజ్,చిలుకల రఘునందన్, నరసింహ,ఢిల్లీ అనిల్,రామకృష్ణ,గణేష్, మల్లేష్ ,చెన్నయ్య,భాస్కర్,పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.