ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారికి సన్మానం
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలో పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందుతున్న ఎన్విరాల్ మెంట్ అధికారి ధనుంజయ రెడ్డి(Environmental Officer Dhanunjaya Reddy)ని సోమవారం జియం కార్యాలయంలో జి.యం. వి. కృష్ణయ్య, విభాగ అధిపతులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భముగా ఏరియా జి.యం. మాట్లాడుతూ.. వారు సింగరేణి సంస్థలో వివిధ హోదాలలో పనిచేశారని ఆయన చేసిన సేవలు మరువలేనివని, అంకితభావంతో పని చేసి అందరిమన్నలను పొందారని, సంస్థకు వారు అందించిన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని, వారి శేష జీవితం సుఖమయంగా ఉండాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యస్వోటు జియం జాకీర్ హుస్సన్, అధికారుల సంఘం నుంచి చిన్నయ్య, గుర్తింపు సంఘం నుంచి లచ్చిరాం, ప్రాతినిధ్య సంఘం నుంచి మహేష్, ఇతర జి.యం. ఆఫీసు అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.






