calender_icon.png 4 May, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారా విద్యార్థినులకు అశ్రునివాళి

03-05-2025 04:27:06 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలం లోతోరియా తండా చెందిన అక్క చెల్లెలు శుక్రవారం నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించగా, పెంబి మండలం శోకసముద్రంలో మునిగింది. బంజారా విద్యార్థులైన బాణావత్ మంజుల, బాణావత్ అశ్వినీ,లు ఎంసెట్ పరీక్ష రాసి తిరుగు ప్రయాణంలో ఆర్మూర్ పట్టణంలో రోడ్డు ప్రమాదం లో మరణించగా, వారు పెంబి మండలానికి చెందిన వారు, కాగా వారి కుటుంబం, బంధువులు, ఈ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ సందర్భంగా ఖానాపూర్ టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య ఝాన్సన్ నాయక్ శనివారం వారి అంత్యక్రియలో పాల్గొని నివాళులు అర్పించారు. కుటుంబాన్ని ఓదార్చి ఆర్థిక సహాయం అందించారు. అంత్యక్రియలకు ఈ ప్రాంత గిరిజన ప్రజలు తరలిరావడంతో కుటుంబం రోదనకు అంతులేకుండా పోయింది.