03-05-2025 04:25:08 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మేచరాజు పల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రాజు భార్యని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండగా అతనికి 2 లక్షల రూపాయల బీమా పరిహారం చెక్కును మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అందజేశారు. రాజు భార్య అనూష గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అనూష బీఆర్ఎస్ క్రియాశీల సభ్యత్వం పొందడంతో పార్టీ ప్రమాద బీమా పథకంలో అనూష పేరును చేర్చగా, ఆ మేరకు రెండు లక్షల రూపాయలు పరిహారంగా మంజూరయ్యాయి. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ పార్టీ క్యాడర్ అధైర్య పడవద్దని, ఆపదలో ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డివిజన్ బీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కోమ్మినేని సందీప్ పటేల్, పిఏసిఎస్ డైరెక్టర్ కొయ్యడి వెంకన్న గౌడ్, పార్టీ నాయకులు పొన్నమనేని రజినీకాంత్ రావు, రాజు పాల్గొన్నారు.