03-05-2025 04:29:17 PM
ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థలం అన్వేషణ చేస్తున్నా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ట్రిపుల్ ఐటీ మహబూబ్నగర్లో ఎక్కడ ఏర్పాటు చేయాలనే అన్వేషణలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాసర ఐఐఐటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ గోవర్ధన్ తో కలిసి మహబూబ్ నగర్ RGUKT IIIT కోసం స్థల పరిశీలన సంబంధించి ప్రత్యేకంగా సమీక్షించారు. అంతకుముందు పాలమూరు యూనివర్సిటీ నందు సబ్ స్టేషన్ నిర్మాణం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సమ్మెత అధికారులు ఉన్నారు.