ఐఎఫ్టియు నాయకుడు రాజసింగ్ కి నివాళి
ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): భారత కార్మిక సంఘాల సమాఖ్య(Indian Federation of Trade Unions) జాతీయ సీనియర్ నాయకులు మంగళవారం పంజాబ్ రాష్ట్రంలో అతని నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణం పంజాబ్ రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గానికి, ఐఎఫ్టియు కి తీరనిలోటని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి.రాసుద్దిన్, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు తోడేటి నాగేశ్వరరావు అన్నారు. ఇల్లందు ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో రాజాసింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గంపై దాడి చేస్తున్న క్రమంలో విప్లవ కార్మిక సంఘం ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజాసింగ్ కు విప్లవ జోహార్లర్పిస్తూ ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియపరుస్తూ అతని ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు డి. మోహన్ రావు, మోటర్ నాయకులు బాలు, రమేష్. విజయ్, మోరే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






