28 June, 2026 | 3:56 PM

Breaking News

లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •  

పోలింగ్ కేంద్రాల ఏర్పాట్ల సన్నాహాలు.. అధికారుల పరిశీలన

10-01-2026 06:17 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): రానున్న మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఏర్పాట్ల సలహాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా శనివారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సీఐ కే.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ పోలింగ్ కేంద్రాలని పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ముందస్తుగానే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నారు. నిర్దేశించిన పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. 

క్లిష్టమైన సాధారణ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో “అస్యూర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్ (AMF)” సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని తనిఖీ చేసారు. ఈ తనిఖీలో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో శుభ్రత, నీరు, విద్యుత్, షేడ్, సీట్లు, ర్యాంప్ (అవసరమైన చోట), టోయిలెట్లు సౌకర్యాలు అమలు తీరును పరిశీలించారు. క్లిష్టమైన ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాట్లు కూడా చేస్తమన్నారు. ఈ మున్సిపల్ సిబ్బంది అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయనీ తెలిపారు.