పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళి
20-05-2024 01:10 AM
విజయక్రాంతి నెట్‌వర్క్: ప్రజాప్రతినిధిగా ఉండి వచ్చిన జీతా న్నే కాకుండా సొంత ఆస్తులను సైతం పేద ప్రజలకు పంచిన గొప్ప నేత పుచ్చలపల్లి సుందరయ్య అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు సీపీఎం నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీడిత ప్రజలకు సుందరయ్య చేసిన సేవలు మరువలేనివన్నారు. జీవితమంతా ప్రజా సమస్యలపైనే పోరాడారని గుర్తుచేశారు. ప్రజాసేవకు పిల్లలు అడ్డొస్తారనే ఉద్దేశంతో భార్యను ఒప్పించి పిల్లలు కనలే దన్నారు. ఎంపీగా పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లిన సదా సీదా నేత సుందరయ్య అని కొనియాడారు.






