calender_icon.png 13 November, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనాలి

20-05-2024 01:08:59 AM

మునిపల్లి, మే 19 : తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. ఆదివారం అందోల్ నియోజకవర్గంలోని పుల్కల్ మండలంలో పర్యటించి తడిసిన వడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతోనే పండించిన ధాన్యం తడిసి ముద్దయిందని చెప్పారు.

వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యం చేసినందుకు రైతులకు నష్టపరిహారం చెలించాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చలన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టెల చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు ఉన్నారు.