calender_icon.png 13 November, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలను అరికట్టాలి

20-05-2024 01:10:57 AM

ప్రభుత్వ విప్ అయిలయ్య

యాదాద్రి భువనగిరి మే19 ( విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్ ప్రారంభమైతున్నం దున నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవా లని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. వర్షాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమైతున్నందున నకిలీ విత్తనాలు, ఎరువులు మార్కెట్‌లోకి వచ్చే ప్రమాదం ఉందన్నారు. సంబంధిత వ్యాపారులపై నిఘాపెట్టి నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతులు కూడా నకిలీ విత్తనాలు, ఎరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధిక దిగుబడి అందించే విత్తనాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ధరకే విత్తనాలను అందించాలని నిర్ణయించిందన్నారు. కందులు, మొక్కజొన్న, ఆముదం విత్తనాలు సబ్సిడీపై అం దించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ విత్తనాల విధానం ఎత్తివేసిందని, రైతుల మేలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీలను పునరుద్దరించినట్టుగా చెప్పారు. యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.