కాంగ్రెస్ కార్యకర్త వీరన్న మృతికి నివాళి
కుటుంబానికి అండగా ఉంటామన్న మందడి ఇజ్రాయిల్
తిరుమలాయపాలెం మే 26 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో అకాల మరణంతో కన్నుమూసిన కాంగ్రెస్ అభిమాని సంకరబోయిన వీరన్న కుటుంబాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకులు మందడి ఇజ్రాయిల్ పరామర్శించారు. వీరన్న నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వీరన్న భార్యకు ధైర్యం చెబుతూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వీరన్న మరణం నాకు తీరని లోటు. చిన్ననాటి నుంచి ఎంతో ఆప్యాయతతో కలిసిమెలిసి పెరిగిన మంచి మిత్రుడిని కోల్పోయాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో వీరన్న ఎప్పుడూ ముందుండి పనిచేసే నిజమైన కాంగ్రెస్ కార్యకర్త అని కొనియాడారు. వీరన్న కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండారు సత్తిరెడ్డి, మోటపోతుల శ్రీనివాస్, అన్నబత్తుల సత్తిబాబు, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






