calender_icon.png 6 December, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

06-12-2025 10:57:10 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం హసన్ పర్తి లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కాదు, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, సమాన అవకాశాలు రావడానికి జీవితాంతం పోరాడిన మహానుభావుడు. సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సమానత్వం ఈ నాలుగు స్తంభాల మీద ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గం ఆయన ఆలోచనల్లోనే ఉంది.

అంబేద్కర్ చూపిన దారి నేడు యువతరం అనుసరించాల్సిన అత్యంత ముఖ్యమైన మార్గమని, అంబేద్కర్ ఆశయాలు మనకు శాశ్వత ప్రేరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పిట్టల కుమారస్వామి, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు ఆరేపల్లి పవన్, రిటైర్డ్ టీచర్ విగ్రహ వ్యవస్థాపకులు కనకం యాదగిరి, బీజేపీ మండల అధ్యక్షులు మారం తిరుపతి, బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి కోయడ రాజు, కార్యదర్శి దాట్ల సునీల్, నాయకులు దాసరి రాజు, మేకల హరిశంకర్, చకిలం రాజేశ్వర్ రావు, తాళ్ళ శ్యామ్, పెద్దమ్మ శ్రీనివాస్, పెద్దమ్మ నాగరాజు, మట్టెడ సుమన్, ఎస్టి సుధాకర్, ఆర్మీ శ్రీను, ఇమ్మడి కరుణాకర్, పెద్దమ్మ కుమారస్వామి, కుంబర్కర్ సాయి, కాంగ్రెస్ నాయకులు జన్ను రవీందర్, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.