18 March, 2026 | 12:00 PM

Breaking News

మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •   తప్పుతై తప్పకుండా ప్రశ్నిస్తాం!   •  

కమ్మగూడలో పార్కు స్థలం కబ్జా

07-12-2025 12:00 AM

ఎమ్మెల్యే రంగారెడ్డికి కాలనీ వాసుల ఫిర్యాదు

తుర్కయంజాల్, డిసెంబర్ 6: తుర్కయంజాల్ సర్కిల్ పరిధి కమ్మగూడ శివాజీనగర్ కాలనీలో 3వేల గజాల పార్కు స్థలం కబ్జాకు గురైందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ నగర్లో పార్కు స్థలాన్ని కబ్జారాయుళ్ల చెర నుంచి విడిపించాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. ఈ స్థలాన్ని ప్రజా అవసరాలకు వినియోగించాలని సూచించారు.

అలాగే పార్కు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి రక్షించాలన్నారు. అలాగే కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని ఎమ్మెల్యే విన్నవించినట్లు తెలిపారు. కాలనీ వాసుల అభ్యర్థన పట్ల ఎమ్మెల్యే రంగారెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వల్లపు భాస్కర్ రెడ్డి,  కొండ సుధాకర్ రెడ్డి, బండ శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి శేఖర్ రెడ్డి, సత్యం గౌడ్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.