calender_icon.png 5 May, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పహల్గామ్ మృతులకు నివాళులు

24-04-2025 07:02:53 PM

కామారెడ్డి (విజయక్రాంతి): పహల్గామ్ ఉగ్రవాదుల కాల్పులలో మరణించిన మృతులకు గురువారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది నివాళులు అర్పించారు. భోజన విరామ సమయంలో ఎంపిడివో ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలసి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఉగ్రవాదుల చర్య పాశవికమైనదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో ప్రవీణ్ కుమార్, పర్యవేక్షకులు మనోహర్, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావు, పంచాయతీ కార్యదర్శి యాదగిరి సిబ్బంది పాల్గొన్నారు.