17 March, 2026 | 11:17 PM

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

17-03-2026 09:52 PM

పాపన్నపేట: మండల కేంద్రం పాపన్నపేటలోని మంజీరా గార్డెన్స్ లో మంగళవారం దావత్ ఏ ఇఫ్తార్ ను ప్రభుత్వం తరఫున సాయంత్రం ఏర్పాటు చేశారు. ఇట్టి ఇఫ్తార్ విందుకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ నెల పవిత్రతను కొనియాడారు. ఇఫ్తార్ విందు అనంతరం పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గోవింద్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, నరేందర్ గౌడ్, సద్దాం హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.