12 May, 2026 | 8:59 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

బిజెపి జోనల్ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా గుగులోతు హుస్సేన్ నాయక్

17-03-2026 09:37 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ గోపాలపురం జోనల్ ఎస్టి మోర్చా అధ్యక్షుడిగా హనుమకొండ 56వ డివిజన్ పరిధిలోని బంజారా కాలనీకి చెందిన గుగులోత్ హుస్సేన్ నాయక్ నియమితులయ్యారు. బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్ ఆదేశం మేరకు బిజెపి గోపాలపురం జోనల్ అధ్యక్షుడు బండి హరీష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి పప్పుల రమేష్ మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా కార్యాలయ కార్యదర్శి అలుగునూరి కృష్ణంరాజు, బిజెపి గోపాల్పూర్ జోనల్ కార్యదర్శి బొద్దిరెడ్డి సురేందర్ రెడ్డి, జోనల్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బత్తుల నాగరాజు, ప్రధాన కార్యదర్శి సతీష్, జిల్లా నాయకులు ఆరే రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.