20-01-2026 08:01:42 PM
ఎన్నికల హామీని నెరవేర్చిన సర్పంచ్ గడ్డం రచన మధుకర్ (చోటు)
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఎన్నికల ప్రచార సమయంలో గ్రామంలోని వికలాంగులు ట్రై సైకిళ్లు కావాలని కోరగా, గెలిచిన వెంటనే అందిస్తానని మాట ఇచ్చిన గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ (చోటు) తన హామీని నెరవేర్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ & వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్రీ కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి వికలాంగులకు ట్రై సైకిళ్లు మంజూరు చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గడ్డం రచన మధుకర్ (చోటు) మాట్లాడుతూ... ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ట్రై సైకిళ్లు అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి, కేకే మహేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కొండ శ్రీకాంత్, వార్డు సభ్యులు మాందాటి శారద, కొండ భరత్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంపల్లి శ్యామ్, బల్ల లక్ష్మీపతి, వడ్డేపల్లి రాజు, మాటేటి రాజు, మామిడిల రమేష్, బండారీ కిషన్, భోగ రంగయ్య, అంబటి అంజయ్య, దూడం సంపత్, గోరంట్ల నాగ్నాథ్ తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.