20-01-2026 07:57:09 PM
ప్రధానోపాధ్యాయుడు అజామోహినుద్దిన్
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు రోటరీక్లబ్ సేవలు అందించటం అభినందనీయమని ప్రధానోపాధ్యాయుడు అజామోహినుద్దిన్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు మంగళవారం రోటరీక్లబ్ సెక్రటరీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుడు అజామోహినుద్ధిన్ సమక్షంలో భోజన ప్లేట్లు అందజేశారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుని చదువుతోపాటు ఆటల్లో ఉన్నతంగా రాణించాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు 350 భోజన ప్లేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు మూర్తి ప్రకామ్, శారద, నారాయణమూర్తి, యూసఫ్, శ్రీహరి, కల్నల్ కామేస్, గంగాధర్, కుదయ్ కుమార్, రాజగోపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.