09-12-2025 02:00:38 AM
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం
జహీరాబాద్ టౌన్, డిసెంబర్ 8 :జహీరాబాద్ నియోజకవర్గంలో ట్రైడెంట్ చక్కెర కర్మాగారం త్వరగా ప్రారం భించాలని ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజక వర్గంలో రైతులు ప్రధానంగా చెరు కు పంటను పండిస్తారని, కర్మాగారం క్రింద 8 మండలాలు ఆధారపడి ఉంటాయని తెలిపారు.
ఈ సంవత్సరం అధిక వర్షాలు పడి చెరుకు దిగుబడి తగ్గి తాము పండించిన చెరుకును ఎక్కడ పంపాలో అర్థంకావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్మాగారాన్ని తెరిపిస్తామని మాటిచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు.
కర్మాగారం ప్రారంభించడానికి ప్రైవేటు యాజమాన్యాలు ముందుకు రాకపోతే ప్రభుత్వమే చొరవ తీసుకొని సరైన మద్దతు ధర ప్రకటించాలని, అదే విదంగా ప్రభుత్వమే ముందుకు వచ్చి కొత్తూర్ (బి) గ్రామంలో చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్సింలు, శికారి గోపాల్ ఉన్నారు.