09-12-2025 01:59:23 AM
జహీరాబాద్ టౌన్, డిసెంబర్ 8 : జహీరాబాద్ పట్టణం పద్మశాలి సంఘం అధ్యక్షునిగా రెం డోసారి గడ్డం జనార్ధన్ ఎన్నికయ్యారు. పద్మశాలి సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి రమేష్ బాబు, సహాయ ఎన్నికల అధికారి కోడిపాక నాగరాజు నిర్వహించగా అధ్యక్షుడిగా గడ్డం జనార్ధన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు, పద్మశాలి సంఘం మొత్తం ఓటర్లు 2006 ఉండగా 1497 ఓట్లు పోలవగా జనార్ధన్ కు 1041 ఓట్లు, దార శ్రీనివాస్ కు 435 ఓట్లు వ చ్చాయి.
దీంతో గడ్డం జనార్ధన్ 606 ఓట్లతో గెలుపొందారు. ఈ సందర్భంగా గడ్డం జనార్ధన్ మాట్లాడుతూ జహీరాబాద్ పద్మశాలి సంఘానికి రెండవసారి అధ్యక్షునిగా ఎన్నికైనందున పద్మశాలి సంఘం అభివృద్ధికి, మార్కండేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సోమచంద్రశేఖర్, రంగ అరుణ్, దండి విట్టల్, అప్పం శ్రవణ్, పండల జగదీష్, రాములు నేత, కొండా శివరాజ్, పండాల రమేష్, పండాల కృష్ణ, కె లక్ష్మణ్, అప్పం రమేష్, ప్రభు, గడ్డం పాండు, విజయ్, అప్పం శ్రీనివాస్, గోపాల్ పాల్గొన్నారు.