17 April, 2026 | 3:07 PM

తృణమూల్‌ను గద్దెదించాలి

23-08-2025 12:38 AM
  1. బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని 
  2. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  3. గయా-ఢిల్లీ అమృత్ భారత్ రైలు ప్రారంభం

పాట్నా/కోల్‌కతా, ఆగస్టు 22: బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దించి రాష్ట్రాన్ని కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. శుక్రవారం బీహా ర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప న చేశారు. గయాలో రూ. 13వేల కోట్ల వ్య యంతో నిర్మించతలపెట్టిన అభివృద్ధి పనుల కు పునాది వేశారు.

ఉత్తర బీహార్-దక్షిణ బీ హార్ మధ్య కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు గంగా నదిపై సిమారియా వంతె నను, గయా-ఢిల్లీ మధ్య అమృత్‌భారత్ రై లును ప్రారంభించారు. బీహార్ ముఖ్యమం త్రి నితీశ్, ఉపముఖ్యమంత్రి సామ్రాట్ పా ల్గొన్నారు. కోల్‌కతాలో పలు అభివృద్ధి ప నులకు శంకుస్థాపన చేసిన మోదీ.. తృణమూల్ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు.