calender_icon.png 23 August, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధార్ చెల్లుతుంది

23-08-2025 12:42:29 AM

  1. ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
  2. ఓటర్ల సవరణ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి
  3. ఆధార్ సహా 11 రకాల పత్రాలు సమర్పించినా సరే
  4. రాజకీయ పార్టీల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన అపెక్స్ కోర్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 22: బీహార్ ఓటర్ల ప్రత్యే క ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) ద్వారా ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది ఓటర్లను తొలగించిన విష యం తెలిసిందే. ఈ వివాదంపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. తీర్పు సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్‌ఐఆర్ ఓటర్లందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని పేర్కొం ది.

అదే సమయంలో రాజకీయ పార్టీల తీరు పై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘తొలగించిన ఓటర్లు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు వ్య క్తం చేయవచ్చు. ఆధార్ కార్డుతో సహా 11 ర కాల పత్రాల్లో ఏవైనా చూపిస్తే సరిపోతుంది’ అని ధర్మాసనం తీర్పు వెలువరించింది. సె ప్టెంబర్ 8కి విచారణ వాయిదా వేసింది. 

రాజకీయ పార్టీలపై ఆశ్చర్యం

సుప్రీం కోర్టు ధర్మాసనం రాష్ట్రంలోని రాజకీయ పార్టీల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు ఏమీ పట్టనట్టు ఉండొద్దు. ముందుకు రావాలి అని  పేర్కొం ది. తొలగించిన ఓటర్లను తిరిగి చేర్చే క్రమం లో బీహార్ రాజకీయ పార్టీలు భాగస్వాము లై, బూత్ స్థాయి ఏజెంట్లతో ఓటర్లకు సా యం చేయాలని సూచనలు చేసింది.

అంతే కాకుండా పేర్ల తొలగింపుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తే దరఖాస్తు సమర్పణల తుది గడువును ఎందుకు పొడిగించకూ డదని జస్టిస్ సూర్యకాంత్ ఈసీని ప్రశ్నించారు. గతంలో సుప్రీం కోర్టు తీర్పు నేప థ్యంలో బీహార్ ఓటర్ల ముసాయిదా జాబి తా నుంచి తొలగించిన వారి పేర్లను వెబ్‌సైట్‌లో ప్రచురించింది.