calender_icon.png 23 August, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నక్సలిజానికి సాయం చేశారు

23-08-2025 12:36:49 AM

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై హోంమంత్రి అమిత్ షా ఆరోపణ

కొచ్చి, ఆగస్టు 22: ఇండియా కూటమి ఉ పరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. కేరళ లో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతు తెలిపారు. 2011లో  సల్వా జుడుం దళానికి వ్యతిరేకంగా తీర్పు వె లువరించారు.

మావోయిస్టులపై పోరాటానికి గిరిజన యువతను ప్రత్యేక పోలీసులుగా వినియోగించడం రాజ్యాంగ విరుద్ధమని వెం టనే నిరాయుధులను చేయాలని ఆ దేశించారు. ఆ తీర్పు ఇచ్చి ఉండకపోతే 2020 నాటికే తీవ్రవాదం అంతరించేది’ అన్నారు. 

సల్వాజుడుంపై తీర్పిదే.. 

చత్తీస్‌గఢ్‌లో పెరిగిపోతున్న నక్సలిజాన్ని ఎదుర్కోవడానికి 2005లో అప్పటి ప్రభు త్వం గిరిజన యువతతో ‘సల్వా జుడుం’ అనే ఓ దళాన్ని ఏర్పాటు చేసింది. ఈ దళ సభ్యులకు పోలీసుల మాదిరి శిక్షణనిచ్చి, అనం తరం ఆయుధాలిచ్చింది. ఈ దళం సాయం తో ప్రభుత్వం నక్సలైట్లను ఏరివేస్తూ వచ్చిం ది. క్రమంగా ఈ దళంపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు వెల్లువెత్తాయి. 2011 లో సుప్రీం కోర్టు ధర్మాసనం సల్వాజుడుంపై చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.