ట్రినిటీ హాస్పిటల్ క్యాలెండర్ ఆవిష్కరణ
28-01-2026 07:30 PM
జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ లోని ఎన్ ఎఫ్ వీ కాలనీ లో ట్రినిటీ హాస్పిటల్ (దమ్మాయిగూడ) క్యాలెండర్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి DSS రాష్ట్ర అధ్యక్షులు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్, సీనియర్ జర్నలిస్ట్ మండల సురేందర్, ట్రినిటీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
అదే విధంగా డా.రాజు, డా.ప్రగతి హాజరై క్యాలెండర్ ఉద్దేశ్యాన్ని అభినందించారు. మేనేజ్‌మెంట్ తరఫున అమృత్ రాజ్, ఎలిజబెత్ పాల్గొని కార్యక్రమ నిర్వహణకు సహకరించారు. అలాగే క్యాంప్ మేనేజర్ కార్తిక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రినిటీ క్యాలెండర్ విశ్వాసం, ఐక్యత మరియు ఆశ అనే సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో రూపొందించబడిందని వక్తలు తెలిపారు.




