calender_icon.png 28 January, 2026 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుపాయల ఆలయ ఈవోగా వీరేశం

28-01-2026 07:33:34 PM

బుధవారం ఏడుపాయల కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ

పాపన్నపేట: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయ ఈవోగా ఎం.వీరేశంను నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ రావు  ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కుషాయిగూడలో ఉన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఏడుపాయల వనదుర్గామాత ఆలయ ఈవోగా బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ను రంగారెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖకు బదిలీ చేశారు. దీంతో బుధవారం ఈఓవీరేశం ఆలయానికి చేరుకొని వనదుర్గామాత దర్శనం అనంతరం బాధ్యతలు చేపట్టారు. వీరేశం ఆలయానికి చేరుకొని వనదుర్గామాత దర్శనం అనంతరం బాధ్యతలు చేపట్టారు.