28-01-2026 07:28:39 PM
జిల్లా ఎస్పీ నరసింహకు వినతి
మోతె,(విజయక్రాంతి): గత నాలుగు రోజుల క్రితం కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులపై కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం మోతే మండల మాజీ జెడ్పిటిసి, సర్పంచులు సీనియర్ నాయకులు జిల్లా ఎస్పీ నరసింహ కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు.
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజలు తమ కుటుంబ సభ్యులని అనుకొని పరిపాలన చేస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్న ఉత్తం దంపతులపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అడ్డగోలుగా మాట్లాడుతున్న వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం శాఖ పరమైన చర్యలు చేపట్టి కేసులు నమోదు చేయాలని వినతి పత్రం అందజేశారు.
శాఖ పరమైన చర్యలు చేపట్టడంతో పాటు అతను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేనిచో భవిష్యత్తులో అతనికి నియోజకవర్గంలో అడ్డుకోవడం జరుగుతుందన్నారు. అక్రమాలకు అడ్డగా మార్చిన బొల్లం మల్లయ్య యాదవ్ చేస్తున్న వ్యాఖ్యలు సభ్య సమాజం హసయించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బానోత్ మాతృనాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నూకల మధుసూదన్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు సామ వెంకటరెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.