20 April, 2026 | 4:30 AM

ఆర్టీసీ సమ్మెకు టీఆర్పీ సంపూర్ణ మద్దతు

20-04-2026 02:21 AM
  1. కార్మికుల సమస్యల పరిష్కారమయ్యే వరకు పోరాటం
  2. ఎమ్మెల్సీ, టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఏప్రిల్ 19(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తానని, కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకూ పోరాటం చేస్తామని ఎమ్మె ల్సీ, టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న అన్నా రు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఆదివారం ఆయన కార్యాలయంలో తీన్మార్ మల్లన్నను ఆర్టీసీ కార్మికులు కలిసి తమ సమస్యలను వివరించి మద్దతు కోరా రు. దీంతో వెంటనే స్పందించిన మల్లన్న వారి పోరాటానికి అండగా నిలుస్తామని, సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న అన్యాయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఎన్నికల సమయం లో ఆర్టీసీ కార్మికు లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్మికుల ప్రధాన డిమాండ్లైన ఆర్టీసీ ప్రైవేటీకరణ, జీతాలపెంపు, ఉద్యోగ భద్రత, పెం డింగ్ బకాయిల చెల్లింపు, సేవా నిబంధనల మెరుగుదల వంటి అంశాలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎలెక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీలో ప్రైవేట్ వ్యవస్థ జోక్యం పెరుగుతుందని, దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని, ఈ ఉద్యమాన్ని మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మల్లన్న స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెంట నిలబడి పోరాటం కొనసాగిస్తుం దని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, యూనియన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.