17-07-2025 11:13:36 PM
టిఆర్ఎస్ఎంఎ జడ్చర్ల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
అందరి నమ్మకం రెట్టింపు అయ్యేలా పనిచేస్తా
టస్మా అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్
జడ్చర్ల : ఐక్యంగా ఉంటే ఎంత పెద్ద సమస్య ఉన్న పరిష్కార రూపం దాల్చుకుంటుందని జడ్చర్ల టస్మా అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం ట్రస్మా అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్ అధ్యక్షతన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సందర్భంగా 2025-2027 సంవత్సరాల కొరకు కమిటిని ఎన్నుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
గౌరవాధ్యక్షులు: కె.మార్రెడ్డి, అధ్యక్షులు: అయ్యూబ్ ఖాన్,
ఉపాధ్యక్షులు: పి.రేణుక- జగదీశ్,
ఎన్.గోపినాథ్, ప్రధాన కార్యదర్శి: రాజోలి నరేష్
సహాయ కార్యదర్శి: గడ్డం సందీప్, ఎ.అనూష,
కోశాధికారి కె.విష్ణువర్ధన్, సహాయ కోశాధికారి: ప్రకాష్ గౌడ్, ఈసీ మెంబర్లుగా జి.వరలక్ష్మి , సురేష, రఫియోద్దిన్,లీగల్ అడ్వైజర్ జి .సత్యం, బద్మీ వీణ, ప్రచార కార్యదర్శిగా కే. శ్రీనాథ్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆయా ప్రైవేట్ స్కూళ్ల కరెస్పాండెంట్లు తదితరులు ఉన్నారు.