calender_icon.png 11 May, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియా, పాక్ మధ్యలో ట్రంప్..

11-05-2025 01:07:09 AM

పహల్గాంలో 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు ఊతం ఇస్తున్న పాకిస్థాన్‌పై మన దేశం దాడులకు పాల్పడగా..పాక్ ప్రతిదాడులకు దిగి సరిహద్దు ప్రాంతాలపై అనైతికంగా సాధారణ పౌరులపై ఫిరంగి గుళ్లు కురిపించింది. అయితే మన దేశం ధాటిని పాకిస్థాన్ తట్టుకోలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తున్న దశలో హఠాత్తుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన అందరినీ ఆశ్చర్యపర్చింది. తాను మధ్యవర్తిత్వం వహించి ఇండియా కాల్పుల విరమణకు ఇరుదేశాలు ఆపేందుకు అంగీకరించాయని ప్రకటించి ఒక్కసారిగా హీరోగా మారారు.

ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రెండు దేశాలు నిత్యం పోరు సల్పుతూనే ఉండగా..ఇండియా-పాకిస్థాన్ మాత్రం ట్రంప్ మాటను గౌరవించి కాల్పులకు చరమగీతం పాడారు. అయితే ఈ ఎపిసోడ్‌లో ట్రంప్ ఒక్కసారిగా హీరోగా మారిపోయారు. తానే పెద్ద యుద్ధం ఆపినట్లుగా ట్రంప్ చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడింది.