11-05-2025 01:09:52 AM
-ఏఐఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ
-పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ రుణం ఇవ్వడంపై ఫైర్
-అంతర్జాతీయ ఉగ్రవాద నిధి అంటూ వ్యాఖ్యలు
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఇచ్చిన బిలియన్ డాలర్ల రుణం అంతర్జాతీయ ఉగ్రవాద నిధి అని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు.
పాకిస్థాన్ ఇప్పుడు అధికారిక బిచ్చగాళ్ల దేశంగా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐఎంఎఫ్ ఇచ్చిన నిధిని పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశం అణ్వాయుధ ఆయుధశాలను నిరాయుధీకరించాలని ప్రపంచ దేశాలను కోరారు.
శనివారం ఓ కార్యక్రమంలో మీడియాతో ఒవైసీ మాట్లాడారు. పాకిస్థాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటానికి అనుమతించాలా వద్దా అని ప్రపంచ దేశాలు, ప్రపంచ నాయకులు ఆలోచన చేయాలని కోరారు. పాకి స్థాన్ అణ్వాయుధాలను నిరాయుధీకరించాలన్నారు. అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాలు పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి రుణం ఇవ్వడాన్ని అంగీకరించడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు.
గత 75 సంవత్సరా లుగా పాకిస్థాన్ ఐఎంఎఫ్ రుణం తీసుకోకుండా ఏమి చేసిందని ప్రశ్నించారు. ఇప్పు డు రుణం తీసుకోవాలని ఎవరు బలవంతం చేశారు? అని ప్రశ్నించారు. ఐఎంఎఫ్ ఇచ్చిన రుణాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఉపయోగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామిక్ సూక్తులు, ఖురాన్ వ్యక్తీకరణలను, మత గ్రంథాలను సందర్భోచి తంగా పాకిస్థాన్ మార్చడంపై ఓవైసీ మండిపడ్డారు.
జమాతే ఇ ఇస్లామి పాకిస్థాన్‌కు చైనా కమ్యూనిస్ట్ పార్టీతో లింకు ఉన్నది అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. జిన్జియాంగ్ ప్రాంతంలో ఉయ్ఘర్ ముస్లింలను పెద్ద ఎత్తు న చంపుతున్నా, నిర్బంధిస్తున్నా పాకిస్థాన్ ఖండించలేదన్నారు. కాగా దేశంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు - ఇప్పుడు న్న సమయంలో గొడవ పడకుండా ఐక్యం గా ఉండాలని సూచించారు.