11-05-2025 01:05:37 AM
అందినట్లే అంది చేజారిపాయె కదా అని దేశవాసులంతా కాస్త నిరాశకు గురయ్యారు. భారత్-పాకిస్థాన్ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని చాలామంది మనం కోల్పోయిన పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకునే సువర్ణావకాశం లభించిందని భావిం చారు. ఎందుకంటే గతంలో ఎప్పూడూ సాధ్యం కానిదని భావిస్తూ వచ్చిన ఈ అవకాశం కాల్పుల విరమణ ఒప్పందంతో చేజారిపోయిందని అంతా భావిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పిన మన దేశం పనిలో పనిగా పీవోకేను స్వాధీనం చేసుకుంటే మరింత బాగుండేదని చాలామంది అనుకుంటున్నారు.