03-02-2026 11:20:00 AM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. భారత్ పై సుంకాలు 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. భారత్ ఉత్పత్తులపై 50 శాతం నుంచి 18 శాతానికి సుంకాలు తగ్గాయి. భారత్ పై సుంకాల తగ్గింపు గురించి ట్రంప్ ట్రూత్ లో పోస్టు చేశారు. అమెరికాపై సుంకాలను సున్నా స్థాయికి చేర్చేందుకు భారత్ అంగీకరించిందని యూఎస్ ప్రెసిడెంట్ తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతి నిలిపేసేందుకు భారత్ అంగీకరించిదని ట్రంప్ వెల్లడించారు. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందానికి(India-US trade agreement) ఇరుదేశాలు అంగీకరించాని చెప్పారు.
భారత్ తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై(Prime Minister Narendra Modi) గౌరవంతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత్ కట్టుబడి ఉందని ట్రంప్ తెలిపారు. అమెరికా సుంకాలను సున్నా స్థాయికి చేర్చేందుకు భారత్ అంగీకరించిందని సూచించారు. వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడాక ట్రంప్ ట్రూత్ లో పోస్టు చేశారు. అమెరికా, వెనెజువెలా నుంచి చమురు కొనేందుకు భారత్ అంగీకరించిందన్నారు. వాణిజ్య ఒప్పందం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై(Russia-Ukraine war) మోదీతో చర్చించినట్లు ట్రంప్ ప్రకటించారు.