1 April, 2026 | 12:48 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

హైకోర్టు తీర్పును అభినందిస్తున్నాం

03-02-2026 01:51 AM

మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేమిలేదు: సుప్రీంకోర్టు

సోషల్ మీడియాలో పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ తిరస్కరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు నమోదు చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సోమవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు సబబేనని అభినందించింది. రాజకీయ విమర్శలపై క్రిమినల్ కేసులు పెట్టొద్దని ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. అయితే అప్పీల్‌ను సుప్రీం కోర్టు సోమవారం తిరస్కరించింది. వివరాల్లోకి వెళితే.. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్త శశిధర్‌గౌడ్(నల్ల బాలు) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు

.దీనిపై శశధర్‌గౌడ్ గతంలో హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఆ ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేసింది. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసు యంత్రాంగానికి పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కేవలం రాజకీయ విమర్శలకే కేసులు పెట్టడం సరికాదని, పరువు నష్టం ఫిర్యాదులపై నేరుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరాదని ఇటీవల తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసిన తెలంగాణ సర్కార్‌కు తాజాగా చుక్కెదురైంది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని స్పష్టం చేసింది.