calender_icon.png 12 January, 2026 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్‌ల్యాండ్‌ అమెరికాది.. స్వాధీనం చేసుకోనివ్వను

12-01-2026 10:33:54 AM

గ్రీన్ లాండ్ అమెరికాది కాబోతోంది.

ఇరాన్ నాయకులు నాకు ఫోన్ చేశారు.

వాషింగ్టన్: చర్చల కోసం ఇరాన్ నాయకులు తనకు ఫోన్ చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) వెల్లడించారు. అమెరికా చేతిలో దెబ్బలు తినడం వారికి విసుగు చెందిందనుకుంటున్నానని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ నాయకత్వంతో సమావేశం కావచ్చని ట్రంప్ తెలిపారు. సమావేశానికి ముందే తాము చర్య తీసుకోవాల్సి రావచ్చని సూచించారు. ఇరాన్ తో ఒక సమావేశం మాత్రం జరుగుతుందన్నారు. ఇరాన్ తన పరిమితులు దాటినట్లుగా కనిపిస్తోందని హెచ్చరించారు. ఇరాన్ నాయకులు కేవలం హింస ద్వారానే పరిపాలిస్తున్నారని ఆరోపించారు.

ఇరాన్ లో హింసను తాను, సైన్యం చాలా తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్ పై బలమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని వ్యాఖ్యానించారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా తీసుకోకపోతే.. రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్‌ల్యాండ్‌ను రష్యా లేదా చైనాను స్వాధీనం చేసుకోనివ్వమని వెల్లడించారు. గ్రీన్ లాండ్ తో ఒప్పందానికి ఇష్టపడతాను.. అది సులభం అన్నారు. ఏదో ఒకవిధంగా గ్రీన్ లాండ్ అమెరికాది కాబోతోందని ట్రంప్ స్పష్టం చేశారు..